స్కంధ షష్టి అనేది ఒక పవిత్ర శ్లోకం. ఇది సకల సమస్యలను దూరం చేస్తుంది. కుమార స్వామిని స్కంధ షష్టి స్తుతించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 19వ శతాబ్దంలో బాల దేవరాయ స్వామిగళ్ రచించిన ఈ మంత్రాన్ని ఏటా 6 రోజుల పాటు స్కంద షష్టి అని పిలుస్తారు.
కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. వివాహం, సంసారం, సంతానం... వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలి.
ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే... ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం.
కుమార స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.
జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.