Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం.. సంపద చేతిలో వుంది కదా అని..?

Advertiesment
శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం.. సంపద చేతిలో వుంది కదా అని..?
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:12 IST)
Godess Lakshmi
శ్రావణ మాసం వచ్చిందంటే ఇక పండుగలే పండుగలు. పూజలూ, నోములతో... ప్రతి ముత్తయిదువులు హడావుడి పడిపోతుంటారు. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు.

అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం... వంటివాటికి చిహ్నము. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలతా సిద్ధిస్తాయి.
 
శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో... ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. 
 
సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉందికదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే... అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల ఎరుకనీ... వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతనీ ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు.
 
శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి, ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు.

ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునే వారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొంటారు. ఈ వ్రతవిధానాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-08-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...