Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-11-2018 నుంచి 24-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

Advertiesment
18-11-2018 నుంచి 24-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)
, శనివారం, 17 నవంబరు 2018 (17:57 IST)
కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, గురు, వక్రి బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు. కుంభంలో కుజుడు. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 20వ తేదీన క్షీరాబ్ధి ద్వాదశి, 22న కార్తీకదీపం. ఈ వారం శివారాధన, విష్ణుధ్యానంలతో సకల కార్యసిద్ధి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వేడుకలు, వససమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తుల వారికి ఆశాజనకం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచలున్నాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. గురు, శుక్ర వారాల్లో పనులు అర్థాంతంగా ముగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం.  
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. శనివారం నాడు ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి లోటుండదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ధనం అందుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. ఆది, సోమ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. అపోహలు తొలగిపోగలవు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. స్వయంకృషితో రాణిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. దురలవాట్లు మానుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంగళ, బుధ వారాల్లో పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. గృహ మరమ్మత్తులు చేపడతారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం సంతోషపరుస్తుంది. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఇంటా బయటా అనుకూలతలున్నాయి. కొంతమెుత్తం ధనం అందుతుంది. విలాస వస్తువులు అమర్చుకుంటారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆది, గురు వారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా ఫలిస్తుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. విమర్శలు మనస్తాపం కలిగిస్తాయి. మంగళ, శని వారాల్లో విమర్శలు పట్టించుకోవద్దు. దంపతుల మధఅ్య అవగాహన నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
సంప్రదింపులు ముందుకు సాగవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం అర్థించి భంగపడతారు. గురు, శుక్ర వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదరవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారుల తీరును గమనించి మెలగండి. ఉద్యోగ ప్రకటనలు విశ్వసించవద్దు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1వ పాదం
ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆర్థిక అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. శనివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. గృహమార్పు ప్రశాంతత నిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను వదులుకోవద్దు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. వనసమారాధనల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారంలో ఆర్థిక లవాదేవీలు పూర్తవుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనయోగం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభ్యత్వాలు, దీక్షలు స్వీకరిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ధనం అందుతుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ నమ్మకం వమ్ము కాదు. ఉత్సాహంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పువస్తుంది. పనులు సానుకూలమవుతాయి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆది, సోమ వారాల్లో ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరీసోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి.
వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నీ మన మంచికే...?