Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభోదయం : రాశిఫలితాలు 01-11-2017

మేషం: శుభకార్యాలు ఘనంగా చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ

శుభోదయం : రాశిఫలితాలు 01-11-2017
, బుధవారం, 1 నవంబరు 2017 (06:01 IST)
మేషం: శుభకార్యాలు ఘనంగా చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త చాలా అవసరం. 
 
వృషభం: మీ సంతానం గురించి సంతోషకరమైన విషయాలను వింటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మిథునం: ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. దీక్షలు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికమవుతుంది.
 
కర్కాటకం: రచయితలు, క్రీడాకారులకు ఆశాభంగం. బంధువులతో  సత్సంబంధాలు నెలకొంటాయి. మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది. రుణ సమస్యలు తొలుగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త అవసరం. ఆందోళన కలిగించే సంఘనలు ఎదురవుతాయి. ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. 
 
సింహం: ఆర్థిక కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రముఖుల సాయం అందుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. 
 
కన్య : దైవదీక్షలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. 
 
తుల: పొదుపు పథకాలు, పెట్టుబడులు లాభిస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. మీ సంతానం విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ఇతరులపై ఆధారపడక, ప్రతి వ్యవహారం మీరే సమీక్షించుకోవడం అన్ని విధాల క్షేమదాయకం. 
 
వృశ్చికం: ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఎప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న పనులు పున:ప్రారంభిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. దైవదర్శనం అతికష్టంమ్మీద అనుకూలిస్తుంది. 
 
ధనస్సు : గృహోపకరణాలు అమర్చుకుంటారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికం.
 
మకరం: వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.
 
కుంభం : ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. వనసమారాధనలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యాపారాల విస్తరణ, పెట్టుబడులకు అనుకూలం. కుటుంబీకుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
మీనం: ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. భాగస్వామిక చర్యలు కొలిక్కి వస్తాయి. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, అధికారులకు ధన ప్రలోభం తగదు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సమయంలో తులసి చెట్టుపై మహిళల నీడ పడితే ఇక అంతే...