Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారంలో గోరింటాకు

Advertiesment
శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారంలో గోరింటాకు
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (05:00 IST)
శ్రీ మహాలక్ష్మీకటాక్షం కోసం శుక్రవారంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుక్రవారం పూట గోరింటాకు పెట్టుకుంటే శుభసూచకమని వారు చెప్తున్నారు. గోరింటాకు పూయించి ఎరుపు రంగు సూర్యునికి పత్రీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.
 
శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. 
 
ఇక భర్తకు గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ అని అంటుటారు.
 
అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. గోరింటాకు పొడిని నూనెలో కలిపి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-02-2021 శుక్రవారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించినా...