Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. చరిత్రేంటో తెలుసా?

Advertiesment
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. చరిత్రేంటో తెలుసా?
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (23:11 IST)
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఈ రోజును ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరికీ ఫిబ్రవరి నెల ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నెలలో వాలంటైన్స్ వీక్ ఉంటుంది. 
 
ఇందులో ఏడు రోజులకు ఏడు ప్రత్యేకతలు ఉన్నాయి. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ రోజులు గడిచిపోయాక ఎనిమిదో రోజు ప్రేమికుల వస్తుంది. ప్రేమలో ఉన్నవారిలో చాలా మంది ఈ రోజును ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.
 
ప్రపంచం మొత్తం ప్రేమ దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ రోజు పుట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కారణం తెలుసుకుందాం. మూడవ శతాబ్దంలో రోమ్ రాజ్యంలో సెయింట్ వాలెంటైన్ అనే ఓ కైస్తవ ప్రవక్త ఉండేవారు. ఆ కాలంలో రోమ్‌ను రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలిస్తున్నారు. మగవాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న అభిప్రాయంతో రెండో క్లాడియస్ తన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు. 
 
ఈ నిర్ణయం వాలెంటైన్‌కు నచ్చలేదు. దాంతో ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. అనుచరులతో కలసి పకడ్బందీగా కార్యం పూర్తించేవారు. ప్రేమ, పెళ్లి దేవుడికి వ్యతిరేకం కాదని ఆయన బోధించేవాడు. వాలైంటెన్స్ ఇలా రహస్య పెళ్లిళ్లు చేయిస్తున్నారన్న విషయం ఎంతోకాలం దాగలేదు. విషయం రెండో క్లాడియస్‌కు తెల్సింది. దీంతో వాలెంటైన్‌ని జైల్లో పెట్టి, మరణశిక్ష విధించారు. తర్వాత చాలా అద్భుతాలలు జరిగాయి. 
 
ఒక కథనం ప్రకారం. వాలెంటైన్‌ జైలు శిక్ష అభువవిస్తున్నడు జైలర్ కుమార్తె జూలియాతో ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయడానికి ముందు వాలెంటైన్ జైలర్ కుమార్తెకు ప్రేమలేఖ పంపించారు. వాలెంటైన్‌ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు. మరో కథనం ప్రకారం.. జైలర్ కూతురు అంధురాలని, వాలైంటెన్ ఆమెకు చూపు తెప్పించాడని అంటారు. 
 
శిక్షిస్తున్న వ్యక్తి కూతరికి కంటిచూపు ప్రసాదించిన ఆ ప్రేమమూర్తి త్యాగాన్ని అందరూ కొనియాడాలని అంటారు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాలి నొప్పికి పెరటివైద్యం