"ఓటు హక్కును వినియోగించుకుందాం!!
ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషిద్దాం!!
ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి. నేడే మీ ఓటును నమోదు చేసుకోండి..!!"
ప్రతి యేటా జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులను మొబైల్ ఫోన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నది.
18 యేళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న లక్ష్యంగా ప్రతి ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు ఓటర్లు తమ ఐడెంటిటీ కార్డు కోసం మీ-సేవను ఆశ్రయించాల్సి వచ్చేది.
తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన ఎన్నికల కమిషన్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓటర్లు తమ ఓటర్ ఐడెంటీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2021 సమ్మర్ రివిజన్‌లో కొత్తగా నమోదైన ఓటర్లు ముందుగా తమ ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశవం కల్పించారు.
ఈ మేరకు యువ ఓటర్లు జాతీయ ఓటర్ దినోత్సవమైన 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ నుంచి ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.