Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏప్రిల్ 23.. కుంభరాశిలోకి అంగారకుడు.. ఈ రాశులకు అదృష్టం..?

Pisces

సెల్వి

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (19:49 IST)
అంగారకుడు ఏప్రిల్ 23వ తేదీన కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇలా కుజుడు తన రాశిని మార్చుకోవడం ద్వారా 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి కనకవర్షం కురువబోతోంది. 
 
అసురుల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. ధైర్యం, శక్తి, పరాక్రమం మొదలైన వాటికి అంగారకుడు కారకుడు. కుజుడి శుభ స్థానం వల్ల వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 
కుజుడి సంచారం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. మీన రాశిలో కుజుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
 
వృషభ రాశి
మీన రాశిలో కుజుడి సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ వనరులు తారసపడతాయి. అదృష్టం కలిసివస్తుంది. పొదుపు చేయగలుగుతారు.
 
మిథున రాశి
మిథున రాశి వారికి కుజుడి సంచారంతో డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి.  ఆకస్మిక ధన లాభం ఉంటుంది. రుణం తీసుకున్నా ఇబ్బందులు వుండవు. 
 
కర్కాటక రాశి
అంగారకుడి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
 
ధనుస్సు రాశి
అంగారకుడి సంచారంతో ధనుస్సు రాశి వారికి ధన ఇబ్బందులు ఉండవు. డబ్బు సంపాదించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సహాయంతో కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు. అదృష్టం కలిసివస్తుంది. 
 
మీన రాశి
మీన రాశి వారికి సంపద పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-04-2024 సోమవారం దినఫలాలు - స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు...