మాఘ పౌర్ణమి.. శనివారం పూట రావడం విశేషమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శివకేశవులకు ప్రీతికరమైన మాఘ మాసంలో పౌర్ణమి నారాయణ స్వామికి ఇష్టమైన శనివారం రావడం విశేష ఫలితాలను ఇస్తుందని వారు చెప్తున్నారు.
ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున దాతృత్వం, గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.
ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి… దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు. మాఘ పూర్ణిమ రోజున కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి.
మాఘ పౌర్ణమి నాడు పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తే అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయి. వీటితో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పద్మ పురాణం చెప్తోంది. సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే.
ఈ సమయంలో శివకేశవులను పూజించాలని, దాన ధర్మాలు చేయాలని.. దైవ చింతనతో గడపాలని పండితులు చెప్తుంటారు. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి దేవాలయాల్లో దైవ దర్శనం చేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.