Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామిక ఏకాదశి 2021: మహావిష్ణువును తులసీ ఆకులతో పూజిస్తే..?

కామిక ఏకాదశి 2021: మహావిష్ణువును తులసీ ఆకులతో పూజిస్తే..?
, బుధవారం, 4 ఆగస్టు 2021 (11:37 IST)
కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఆగస్టు 04 బుధవారం. కామిక ఏకాదశి రోజున విష్ణుపూజతో పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు 
 
ఏకాదశి తిథి ఆగస్టు 03, మంగళవారం మధ్యాహ్నం 12:59 నుండి ప్రారంభమవుతుంది. బుధవారం, 04 ఆగస్టు బుధవారం మధ్యాహ్నం 03:17 గంటలకు ముగుస్తుంది. కామిక ఏకాదశి రోజున, విష్ణుమూర్తి ఆరాధనతో మేలు జరుగుతుంది. ఉపవాసం, జాగరణతో వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
కామిక ఏకాదశి అన్ని కోరికలను నెరవేరుస్తుంది. పాపాల నుండి విముక్తి పొందుతుంది. ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి చెప్పాడు. 
 
ఉదయాన్నే లేచి స్నానం చేయండి
దీపారాధాన చేయండి
గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి.
విష్ణుమూర్తికి పుష్పాలు, తులసి దళాలను సమర్పించండి.
వీలైతే, ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి.
 
దేవునికి నైవేద్యంగా రవ్వల పదార్థాలను అర్పించండి. తులసిని తప్పనిసరిగా చేర్చాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-08-2021 బుధవారం దినఫలాలు - లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే...