Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-08-2021 బుధవారం దినఫలాలు - లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే...

04-08-2021 బుధవారం దినఫలాలు - లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే...
, బుధవారం, 4 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు.
అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, పెట్టుబడుల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. 
 
వృషభం : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాల విషయంలో పునరాలోచన మచిది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, వైద్య కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
మిథునం : వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ప్రయత్నపూర్వకంగా మొండిబాకీలు వసూలు కాగలవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉమ్మడి వ్యాపారాల్లో పట్టుసాధిస్తారు. 
 
కర్కాటకం : మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
సింహం : రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతాయి. అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు అవరం. వైద్యులకు పురోభివృద్ధి కానవస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందుట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలు టీవీ, చానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. 
 
తుల : వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆత్మీయుల రాకతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు గుర్తుకువస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. కొత్త పరిచయాల వల్ల కార్యక్రమాలు విస్తృతమవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. 
 
మకరం : స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకుసాగవు. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. 
 
కుంభం : ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. 
 
మీనం : ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్థిరచరాస్థుల విషయంలో ఏకీభావం కుదరదు. మిత్రులను కలుసుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. రాబడికి మంచిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-08-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...