Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దారిద్ర్యం తొలగిపోవాలంటే.. శ్రావణ మంగళవారం.. ఇలా పూజ చేస్తే..?

Advertiesment
Lakshmi Puja
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:56 IST)
ప్రతి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొలువైనందున సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. అదేవిధంగా, మంగళ, శుక్రవారం సాయంత్రం 6:00 గంటల తర్వాత మహాలక్ష్మి పూజ చేయడం ఉత్తమం. శ్రావణ మాసం శుక్రవారం నాడు మనం చేయగలిగే మహాలక్ష్మి పూజ సూచనలేంటో చూద్దాం.. 
 
దారిద్ర్యం తొలగిపోవాలంటే.. అదృష్టాన్ని పొంది అఖండ ఐశ్వర్యవంతులు కావాలంటే శ్రావణ మంగళవారం లక్ష్మీదేవిని పూజించాలి. డబ్బున్న వారు బంగారు నాణేలతో కూడా పూజలు చేస్తారు. అయితే మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ప్రేమతో, నిర్మలమైన మనసుతో, భక్తితో చేస్తే చాలు. కాబట్టి, సౌలభ్యం ప్రకారం పూజా సామగ్రిని ఉపయోగించవచ్చు.
 
 
పూజ యొక్క మొదటి రోజున ఇంటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. మహాలక్ష్మి పూజకు అమ్మవారి విగ్రహం లేదా ఫోటో అవసరం. గంధం, పసుపు, కుంకుమను సిద్ధంగా ఉంచాలి. 
 
తామరపువ్వులు, మల్లె, మందార పువ్వులను పూజకు ఉపయోగించవచ్చు. చిన్నపాటి కలశం వుంచవచ్చు. ఇందులో పనీరును తీసుకుని చిటికెడు యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి, పసుపు వేసి కలపాలి. ఆపై సంకల్పం చెప్పుకుని..108 నాణేలు, లేదా పువ్వులు, ముడుపు కోసం కుంకుమను సిద్ధం చేసుకోవాలి.
 
నెయ్యి దీపం వెలిగించి, కుంకుమ అర్చన చేసి పూజ ప్రారంభించాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించాలి.  పేదరికంలో చిక్కుకున్న కుటుంబానికి మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రార్థించి అమ్మవారికి జామకాయ సమర్పించాలి.  
 
మరుసటి రోజు ఉదయం, ఒక జామకాయ పూజ చేసిన వారు ప్రసాదంగా స్వీకరించాలి. మిగిలినది ఇతరులకు దానం చేయాలి. ప్రతి ఇంట్లో మహాలక్ష్మి కొలువైనందున సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. అదేవిధంగా, శుక్రవారం సాయంత్రం 6:00 గంటల తర్వాత మహాలక్ష్మి పూజ చేయడం ఉత్తమం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-08-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...