Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

ధనుర్మాసం దీపారాధన చేస్తే ఏం జరుగుతుందంటే? (Video)

Advertiesment
Dhanurmasa
, గురువారం, 19 డిశెంబరు 2019 (09:53 IST)
ధనుర్మాసం పూజలకు విశిష్టమైనది. ఈ మాసంలో విష్ణుపూజ ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయం అవుతాయి. ఈ మాసంలో దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కల్యాణం ప్రసాదాలు మొదలైనవి నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. 
 
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ నెలలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసినవారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటంవల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. 
 
శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెల రోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభవౌతుంది. గోదాదేవి పాడుకున్న ముప్ఫై పాశురాల్నీ రోజుకొకటి చొప్పున గానం చేస్తారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-12-2019 గురువారం మీ రాశి ఫలితాలు