Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-08-2019- సోమవారం రాశి ఫలితాలు..

Advertiesment
26-08-2019- సోమవారం రాశి ఫలితాలు..
, సోమవారం, 26 ఆగస్టు 2019 (10:41 IST)
మేషం: ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవటం శ్రేయస్కరం. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం: చేపట్టిన పనులలో శ్రమాధిఖ్యత, ప్రయాసలు తప్పవు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్ధిక సంతృప్తి ఉండదు. జీవితభాగస్వామి ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. ప్రముఖులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందించి పరిచయాలు పెంచుకుంటారు. 
 
మిధునం: కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం: క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కుంటారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. నూతన వ్యాపారాలు, సంస్ధల స్థాపనలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మెలకువ వహించండి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
సింహం: ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది. బంగారం, వెండి, వస్త్ర, లోహ వ్యాపారులకు లాభదాయకం. రాబడికి మించిన ఖర్చులెదుర్కుంటారు. సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది.
 
కన్య: వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. ఆత్మీయులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్నచోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలుంటాయి. 
 
తుల: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం విద్య, వివాహాల విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి.
 
వృశ్చికం: వాణిజ్య ఒప్పందాలు, స్ధిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించటం వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.
 
ధనస్సు: దైనందిన కార్యక్రమాలు  మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అధికం కావటంతో రుణాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. అవివాహితులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
మకరం: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
కుంభం: కొబ్బరి, పండ్ల, పూల, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసికాగలదు. బంధుమిత్రుల కలయిక సంతోషపరుస్తుంది. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పలు వాయిదాపడతాయి. కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. ఇతరులతో కలిని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: విద్యార్థుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు. పారిశ్రామిక రంగంలోని వారికి తరుచు విద్యుత్ అంతరాయం, కార్మిక సమస్యలు తలెత్తుతాయి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు. వాహన యోగం వంటి శుభపరిణామా లుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#DailyPredictions 25-08-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు