Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-06-2019 మీ దినఫలాల : శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానాలు..

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 5 జూన్ 2019 (06:04 IST)
మేషం : శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. అందరికీ సహాయం చేసి మాటపడతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలించవు. నరాలు, తల, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో మెళకువ వహించండి.
 
వృషభం : ముఖ్యంగా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభించినా రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు.
 
మిథునం : దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రయ, విక్రయ రంగాలలో వారికి అనుకూలంగా ఉండగలదు. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. తాపి పనివారికి లాభదాయకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
కర్కాటకం : కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధన విరిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మామిడిపండ్లు, పూలు, కొబ్బరి, చిరు, వ్యాపారులకు లాభదాయకం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
 
సింహం : మీ సంతానంపై ప్రేమ, వాత్సల్యాలు పెరుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. తలపెట్టిన పనిలో సంతృప్తి జయం చేకూరుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త వహించండి.
 
కన్య : ఆర్థిక సమస్యలు ఉండవు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఇది తగిన సమయం. బంధువుల చేయూతతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహంలో మరమ్మతులు పూర్తి చేస్తారు.
 
తుల : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. మీరు పై అధికారుల నుంచి మన్నలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనా లోపం అధికమవుతుంది. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల నష్టపోతారు.
 
వృశ్చికం : మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
ధనస్సు : విద్యాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల చికాకులు తప్పవు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం. చికాకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల పట్ల ఆసక్తి అంతగా ఉండదు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు.
 
మకరం : వృత్తి వ్యాపారాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విజయం సాధించిన రోజు దూరమైనవారు తప్పక మిమ్మలను వెతుక్కుంటూ వస్తారు. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగాగానీ ఓ త్యాగం చేయాల్సి ఉంటుంది.
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పని ఒత్తిడి తగ్గి కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలోనివారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. మీ ఓర్పుకు పరీక్షా సమయం. టెక్నికల్, కంప్యూటర్ రంగంలోని వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మీనం : మిత్రుల కోసం ఖర్చు చేస్తారు. భాగస్వామ్యుల మధ్య అవగాహన, అభివృద్ధి కానవస్తుంది. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా ధనం తిరిగి రాజాలదు. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-06-2019 మీ దినఫలాల : ఉద్యోగస్తులు అధికారుల తీరు...