Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-02-2019 గురువారం దినఫలాలు - అధికారిక పర్యటనలు...

Advertiesment
21-02-2019 గురువారం దినఫలాలు - అధికారిక పర్యటనలు...
, గురువారం, 21 ఫిబ్రవరి 2019 (07:36 IST)
మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలు తొందరపాటుతనం వలన ప్రియతములను దూరం చేసుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం: వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. దంపతుల మధ్య సఖ్యాతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాల్లో మీరెంత తెలివిగా వ్యవహిరించినా ఫలితాలు భిన్నంగానే ఉంటాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవండ శ్రేయస్కరం. కాంట్రాక్టర్లకు కార్మికులతో సఖ్యత నెలకొంటుంది.
 
మిధునం: విదేశీ యత్నాలు వాయిదా పడుతాయి. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. భాగస్వామికుల మాటతీరు, కదలికలను గమనించడం ఎంతైనా మంచిది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. తలపెట్టిన పనులు వేగవంతమవుతాయి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడుతాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. స్టాక్‌మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. శారీరక శ్రమ, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం: స్త్రీలకు విదేసీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. రుణయత్నాలు మాత్రమే ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. విద్యాసంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య: కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
తుల: రవాణా రంగాలలో వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ప్రయాణాలలోనూ, బ్యాంకు వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కుంటారు. పత్రికా, ప్రైవేటు రంగాలవారికి ఆర్ధిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులను ఎదుర్కుంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు, వైద్యులకు అనుకూలత. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.
 
ధనస్సు: స్థిరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. విద్యార్థులకు మిత్రబృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. స్త్రీలతో అతిగా సంభాషించడం వలన అపార్థాలకు గురికావలసివస్తుంది.
 
మకరం: నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వలన ఆందోళనకు గురవుతారు. రావలసిన ధనం వాయిదాపడుడ వలన ఆందోళనకు గురవుతారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పత్రికా సంస్థల్లోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు వంటివి ఎదుర్కుంటారు.
 
కుంభం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. సభా సమావేశాలలో పాల్గొనడం వలన ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి.
 
మీనం: ఆర్థిక పరిస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలలో ఉద్రేక పడడం మంచిది కాదని గ్రహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా, ప్రైవేటు రంగాలవారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశలను గుర్తించడం ఎలా..?