Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-05-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయుడిని ఆరాధిస్తే...

Advertiesment
19-05-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయుడిని ఆరాధిస్తే...
, మంగళవారం, 19 మే 2020 (05:00 IST)
మేషం : మీ శ్రీమతి, సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలిస్తాయి. సాహస యత్నాలు విరమించండి. కోర్టు వ్యవహారాలు భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
వృషభం : దూర ప్రయాణం మంచిదికాదు. దుబారా ఖర్చులు నివారించగలుగుతారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలనిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మిథునం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండారు వ్యాపారులకు లాభం. ఉద్యోగస్తులకు త్వరలో ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ కాగలవు. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. 
 
సింహం : ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాల్లో సంతృప్తికానరాదు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. అకాలభోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విందు, వినోదాల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. 
 
కన్య : పాత వస్తువునుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. 
 
తుల : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆకస్మిక ఖర్చులు వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. 
 
వృశ్చికం : నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, ప్రమోషన్ వంటి శుభపరిణామాలుంటాయి. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పొదుపు దిశగా మీ యత్నాలు కొనసాగిస్తారు. 
 
ధనస్సు : బంధు మిత్రులు మిమ్మలను గురించి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలోలని వారికి పనిభారం. విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మకరం : హోటల్, క్యాటరింగ్, పనివారలకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి ఆశాజనకం. చేపట్టినపనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుగా వ్యవహరిస్తారు. 
 
కుంభం : వస్త్ర, బంగారు, వెండి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ పట్టుదల అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు అయినవారి నుంచి ఆదరణ లభిస్తుంది. 
 
మీనం : ఆర్థిక విషయాలలో ప్రణాలికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. గృహోపకరణాలను అమర్చుకోవడంలో మునిగిపోతారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. వైద్యులు ఆపరేషన్లు చేయటంలో విజయం సాధించగలుగుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

57 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం విక్రయం