Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-09-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం?

మేషం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారాకి మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, గృహ ప్రశాంతతకు

06-09-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం?
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (09:15 IST)
మేషం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారాకి మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
వృషభం: కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఋుణ ప్రయత్నం ఫలిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులు, ఆందోళనలను ఎదుర్కుంటారు. 
 
మిధునం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారి పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకంగా ఉంటుంది.  
 
కర్కాటకం: సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల తొందరపాటు తనానికి అధికారులతో మాటపడక తప్పదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. సందర్భానుకూలంగా సంభాషించడం వలన మీకు గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం: ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కన్య: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ధనవ్యయం, చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. 
 
తుల: స్త్రీలు ఆడంబారలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దలు ఆరోగ్యంలో మెళకువ అవసరం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. విందులలో పరిమిత పాటించండి. ఉద్యోగస్తులు పనిభారం అధికమవుతుంది.
 
వృశ్చికం: స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రముఖులు ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల చేతికందుతాయి. బంధుమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.      
 
ధనస్సు: నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పనుల వాయిదా పడుటవలన  ఆందోళన చెందుతారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రచయితలకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది.     
 
మకరం: మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తారు. అతిధి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడుతాయి.  
 
కుంభం: విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి.   
 
మీనం: బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సహచరుల సలహావలన నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా అవి వస్తాయ్... స్వామి వివేకానంద