Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-02-2019 - బుధవారం మీ రాశి ఫలితాలు - కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు...

Advertiesment
06-02-2019 - బుధవారం మీ రాశి ఫలితాలు - కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు...
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:00 IST)
మేషం: బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. స్త్రీలతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి, మొహమ్మాటాలు వంటివి ఎదుర్కుంటారు.
 
వృషభం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. 
 
మిధునం: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి.  
 
సింహం: కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో చికాకులు తప్పవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కుంటారు. 
 
కన్య: స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.  
 
తుల: బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యాలు మనస్తాపం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికిని వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిగిరాగలదు. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. 
 
వృశ్చికం: ప్రింటింగ్ రంగాల వారికి బకాల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలు తొందరపడి వాగ్దానాలు చేయడం వలన సమస్యలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు: మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. 
 
మకరం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి. హోటర్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు.    
 
కుంభం: పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు.   
 
మీనం: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమైన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎలా..?