Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-10-2019- శుక్రవారం దినఫలాలు - మీ ఆంతరంగిక సమస్యలకు...

Advertiesment
04-10-2019- శుక్రవారం దినఫలాలు - మీ ఆంతరంగిక సమస్యలకు...
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (08:17 IST)
మేషం: విదేశాలు వెళ్శడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కీర్తి పతిష్ఠలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. గృహోపకరణాలు కొనగోలు చేస్తారు.
 
వృషభం: తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బంధువులను కలుసు కుంటారు. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. బంగారు, వస్త్ర, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి.
 
మిధునం: మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానవస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటినుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. ప్రణాళికా బధ్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాలల్లో లక్ష్యాలు సాధిస్తారు.
 
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
 
సింహం: దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి చేకూరగలదు.
 
కన్య: చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు అధికం. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
తుల: ప్రైవేటు సంస్థలలో వారు అశ్రద్ధ, ఆలస్యాలవలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కుంటారు. ఫ్యాన్సీ, వస్త్ర, కిరాణా, కిళ్లి రంగాలలో వారికి కలిసి రాగలదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
వృశ్చికం: పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలలోని వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు.
 
ధనస్సు: బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది.
 
మకరం: జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోబదపడతాయి. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. మీ ఏమరపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారి పోయే ఆస్కారం ఉంది. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
కుంభం: సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాల వాటిపై దృష్టి పెట్టండి. కోర్టు వ్యవహారాలు మెరుగు పడతాయి. కుటుంబీకుల నుంచి సహాయాన్ని పొందుతారు.
 
మీనం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. కార్యసాధనలో ఆటంకాలు తొలగి వ్యవహారాలు సానుకూలమవుతాయి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..