Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-05-2020 శనివారం దినఫలాలు - ఆనంతపద్మనాభస్వామిని ఆరాధిస్తే...

Advertiesment
02-05-2020 శనివారం దినఫలాలు - ఆనంతపద్మనాభస్వామిని ఆరాధిస్తే...
, శనివారం, 2 మే 2020 (05:00 IST)
మేషం : స్థిరాస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విదేశీయత్నాల్లో ఎదురైన ఆటంకాలు అధికమిస్తారు. వ్యాపారస్తులు అధిక శ్రమకు లాభాలను పొందుతారు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. యాదృచ్ఛికంగా ఆలయ సందర్శనాలలో బంధువులను కలుసుకుంటారు. 
 
వృషభం : నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. బ్యాంకు పనులు చికాకు కలిగిస్తాయి. ప్రేమికులకు ఉన్న అపార్థాలు తొలగిపోవడంతో ప్రశాంతత చేకూరి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. 
 
మిథునం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
సింహం : నిర్మాణ పనులు, గృహ మరమ్మతులలో ఏకాగ్ర వహించండి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
కన్య : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ స్తోమతకు మించి వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు తీర్చడానికై చేయు యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. 
 
తుల : బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం అవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం. విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
వృశ్చికం : ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఖర్చులు తగ్గంచుకోవాలనే మీ యత్నం అనుకూలించదు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, ప్రమోషన్. తీర్థయాత్రలలో పరిణామాలుంటాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కీలకమైన విషయాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. 
 
మకరం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థినిలకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి, ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
కుంభం : స్త్రీలకు నరాలకు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. విదేశాల్లోని అభిమానుల క్షేమ సమచారం ఆందోళన కలిగిస్తుంది. రుణాలు తీరుస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్వు. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో విజయంసాధిస్తారు. 
 
మీనం : దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం. విద్య, వైజ్ఞానిక రంగాలలోని వారికి జయం చేకూరుతుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు కలిసిరాగలవు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వృత్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపుతారు. కార్మికులకు ఆందోళన అధికమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-05-2020 శుక్రవారం దినఫలాలు - కామేశ్వరిదేవిని పూజిస్తే...