Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-02-2019 శుక్రవారం దినఫలాలు ... ఆదాయ వ్యయాల్లో...

Advertiesment
01-02-2019 శుక్రవారం దినఫలాలు ... ఆదాయ వ్యయాల్లో...
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (08:24 IST)
మేషం: ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. రుణం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
వృషభం: కొత్తగా చేపట్టిన వ్యాపారాలు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఒక ఖర్చుకు తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగించవలసివస్తుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడుతాయి.  
 
మిధునం: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇతరుల విషయంలో తప్పిదాలు ఎంచక సంయమనం పాటించండి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. నూతన పరిచయాలేర్పడుతాయి.  
 
కర్కాటకం: హోటల్, క్యాటరింగ్, వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.  
 
సింహం: విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. స్త్రీలకు ఎదుటివారి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్ణయాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. అనుకోకుండా నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. 
 
కన్య: ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య అవగాహనలోపం చికాకులు వంటివి చోటు చేసుకుంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.  
 
తుల: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌‍పోర్టు రంగాల వారికి శుభదాయకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ, ఏకాగ్రత అవసరం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వలన ఊహించని ఇబ్బందులు ఎదుర్కుంటారు. దూరప్రాంతాల నుండి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఆలోచనలు, ఆశలు కలిగిస్తుంది.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ఊహించని వ్యక్తుల నుండి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. ఖర్చులు అధికం కావడం, వృధా ధనవ్యయం వలన నిరుత్సాహం చెందుతారు. రుణాలు, చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకెంతో సంతృప్తినిస్తాయి.  
 
మకరం: సొంత వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.     
 
కుంభం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో జాప్యం, పనివారల తీరు వలన మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.   
 
మీనం: హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కొన్ని విషయాలలో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శయనస్థితిలో హనుమంతుడు.. ఆయన్ని పూజిస్తే.. బుద్ధిమంతుడైన భర్త? (video)