Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-01-2019 బుధవారం దినఫలాలు - తలపెట్టిన పనుల్లో...

Advertiesment
30-01-2019 బుధవారం దినఫలాలు - తలపెట్టిన పనుల్లో...
, బుధవారం, 30 జనవరి 2019 (08:34 IST)
మేషం: ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఆలయ సందర్శనాలలో హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, నిరుత్సాహం ఎదుర్కుంటారు. స్త్రీలకు బంధువులు, చుట్టుప్రక్కల వారితో సఖ్యత నెలకొంటుంది.
 
వృషభం: వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. సన్నిహితులతో కలిపి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ప్రతి విషయంలోను స్త్రీలదే పై చేయిగా ఉంటుంది. పత్రిక, వార్తా సంస్థల్లోని వారికి తోటివారి వలన చికాకులు తప్పవు. 
 
మిధునం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, బేకరీ వ్యాపారులకు ఆశాజనకం. నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు సెలవు దొరకడం కష్టమే. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతి విషయంలోను స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. 
 
కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరుత్సాహం తగదు. పుణ్యక్షేత్రాలలోని అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో అవస్థలు తప్పవు. మిమ్ములను పొగిడే వ్యక్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.  
 
సింహం: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తితడి అధికమవుతుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు లీవు, అడ్వాన్స్‌లు మంజూరవుతాయి.  
 
కన్య: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. బిల్లులు చెల్లిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది.  
 
తుల: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. క్రయవిక్రయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం అనార్థాలకు దారితీస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం: స్త్రీలకు టి.వి ఛానెళ్ళు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు యాజమాన్యం నుండి ఒత్తిడి అధికం. కుటుంబంలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల రాకపోకల వలన ధనం అధికంగా వ్యయం చేయవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసివస్తుంది. 
 
ధనస్సు: విద్యార్థులు పరస్పరం విలువైన కానుకల్చిపుచ్చుకుంటారు. దైవదర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూరప్రయాణాల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మకరం: ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం.     
 
కుంభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అకాల భోజనం వలన మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.   
 
మీనం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం ఉత్తమం. భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ మల్లిఖార్జున స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది?