Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14-03-2018 బుధవారం మీ రాశి ఫలితాలు.. మీ శ్రీమతికి అలా చేయడం నచ్చకపోవచ్చు.. (Video)

మేషం: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తుల వారికి అవ

14-03-2018 బుధవారం మీ రాశి ఫలితాలు.. మీ శ్రీమతికి అలా చేయడం నచ్చకపోవచ్చు.. (Video)
, బుధవారం, 14 మార్చి 2018 (08:49 IST)
మేషం: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి.
 
వృషభం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగాల్సివుంటుంది. సాహిత్య, సన్మాన సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిగా పడతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
మిథునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. 
 
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. యువకులకు వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య, ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. 
 
సింహం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు అలంకరణ, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
కన్య : మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. బంధువుల రాకతో పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యూటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
తుల: రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు తప్పవు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు.
 
వృశ్చికం: నూతన వ్యక్తులు కలయిల వలన మీలో కొత్త ఉత్తేజం కానరాగలదు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులకు పురోభివృద్ధి కానవస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
మకరం: విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. కొత్తపెట్టుబడులు పెట్టేటప్పుడు మెళకువ అవసరం. వస్త్ర, కళంకారి, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
కుంభం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రుణాలు తీర్చడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం : ఆర్థికలావాదేవీల పట్ల ఏకాగ్రత వహించండి. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారం ఇబ్బందికి దారితీస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వస్తిక్ గుర్తును ఇంటి ద్వారంపై అంటిస్తే? ఏమౌతుందంటే?