భీష్ముడు మాఘ శుక్ల అష్టమి నాడు తనువు చాలించినా వైకుంఠానికి చేరడానికి మూడు రోజులు పడుతుంది. కావున ఏకాదశి నాడు భీష్ముడు మోక్షాన్ని పొందాడని ప్రసిద్ధి. అందుకే మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా పిలుస్తారు.
అందుకే ఈ రోజున భీష్మునికి ఇష్టమైన విష్ణు సహస్రనామమును ఈ ఏకాదశి నాడు ఉపవాసముతో మూడుసార్లకు తగ్గకుండా శక్తి మేరకు పారాయణము చేయాలి.
భీష్మ ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు అఖండ విష్ణు సహస్రనామ పారాయణ జరిగితే పరమాత్మ వైకుంఠాన్ని ప్రసాదిస్తారు, మరు జన్మ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి.
ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించాలి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" అనే ఈ శ్లోకాన్ని చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానమని.. పార్వతీ దేవికి పరమ శివుడు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి.