Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు ఉసిరి నవమి, అక్షయ నవమి.. ఉసిరి చెట్టు కింద నేతి దీపం.. సత్యయుగం..?

Advertiesment
Akshaya Navami 2025

సెల్వి

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (09:35 IST)
Akshaya Navami 2025
ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటారు. కార్తీక మాసం కార్తీక శుక్ల నవమి తిథి అక్టోబర్ 30 ఉదయం 10:06 కి మొదలవుతుంది. అక్టోబర్ 31 ఉదయం 10:03 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి అక్టోబర్ 31న అక్షయ నవమిని జరుపుకోవాలి. ఈరోజు శుభ యోగాలు కూడా ఏర్పడతాయి.
 
అక్షయ నవమి నాడు వృద్ధి యోగం, రవి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం వుంటే మంచిది. అక్షయ నవమి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి. 
 
అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీపావళి నాడు వెండి, బంగారం కొనేవారు అక్షయ నవమి నాడు కొనుగోలు చేసినా కూడా శుభఫలితాలు ఎదురవుతాయి. 
 
ఉసిరి చెట్టు కింద నేతి దీపం వెలిగించి.. ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. వీలైతే ఉత్తర వైపు ఉసిరి చెట్టు నాటాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర దిశలో వీలు కాకపోతే తూర్పు వైపు నాటవచ్చు.
 
సత్య యుగం అక్షయ నవమి రోజున ప్రారంభమైందని విశ్వాసం. అందుకే అక్షయ నవమి రోజును సత్య యుగాది అని కూడా పిలుస్తారు. ఇది అన్ని రకాల దాన-పుణ్య కార్యకలాపాలకు చాలా ముఖ్యమైన తిథి. అక్షయ అనే పేరు సూచించినట్లుగా, ఈ రోజున ఏదైనా దాన లేదా భక్తి కార్యకలాపాలు చేయడం వల్ల కలిగే ప్రతిఫలం ఎప్పటికీ తగ్గదు. ఈ జన్మలోనే కాకుండా పుణ్యఫలం పెరుగుతూ వుంటుందని విశ్వాసం. 
 
అక్షయ నవమి రోజు అక్షయ తృతీయ రోజు వలె ముఖ్యమైనది. అక్షయ తృతీయ త్రేత యుగాది అయితే, నాలుగు యుగాలలో త్రేత యుగాలు ప్రారంభమైన రోజు. అలాగే అక్షయ నవమి సత్య యుగాది. అక్షయ నవమి పవిత్ర దినమైన మధుర-బృందావనంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు