Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

Advertiesment
nata balakrishna

ఠాగూర్

, గురువారం, 10 జులై 2025 (13:56 IST)
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు 
వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది పాల్గొని జయప్రదం చేశారు. నాట్స్ వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో కిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు. అంతేకాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు.
 
ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీలతో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేశారు. సంగీత దర్శకులు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌‌తో మ్యాజిక్ చేశారు. సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం వేసేలా "నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి.
నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికీ నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్‌ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు. నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్ చక్కని ప్రణాళిక, సమన్వయంతో వేడుకలు విజయవంతమయ్యేలా కృషి చేశారు. 
 
సంబ‌రాలే కాక సామాజిక బాద్యతగా హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి నాట్స్‌ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్‌ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి