Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒబిసిటీకి చెక్ పెట్టే టమోటాతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి?

Advertiesment
ఒబిసిటీకి చెక్ పెట్టే టమోటాతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి?
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:17 IST)
టమోటాలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. టమోటాలోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. అలాంటి టమోటాలతో టేస్టీ చేపల ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
టమోటాలు - నాలుగు 
చేప ముక్కలు - పావు కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్ 
సోంపు పొడి - ఒక టీ స్పూన్ 
మిరియాల పొడి - ఒక టీ స్పూన్ 
కారం పొడి - ఒక టీ స్పూన్ 
పసుపు పొడి - అర టీ స్పూన్ 
ధనియాల పొడి - 2 టీ స్పూన్లు 
ఉప్పు, నూనె - తగినంత  
 
తయారీ విధానం : 
ముందుగా టమోటాలను మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ టమోటా పేస్టులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఉప్పు చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకు పట్టించి అరగంట పాటు ఊరనివ్వాలి. అరగంట తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక.. చేపముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు వేపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ చేపముక్కల్ని దోసె తవాలోనూ ఫ్రైలా చేసుకోవచ్చు. అంతే టమోటా చేపల ఫ్రై రెడీ. వీటిని వేడి వేడి అన్నానికి సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలతో మతిమరుపు దూరం... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...