చేపలతో గ్రేవీ, ఫ్రై ఇలా రకరకాలుగా వంటకాలను టేస్ట్ చేసి వుంటారు. ఈరోజు మనం చేపలతో గారెలు ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - 500 గ్రా
గుడ్డు - 1
బంగాళాదుంప - 100 గ్రా
కారం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - కావలసినంత
నూనె - వేయించడానికి
తయారీ విధానం
ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసి కొద్దిగా నీళ్లతో బాణలిలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని తీసుకుని ముల్లు, చర్మం తీసేయాలి. ఆపై బంగాళాదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి బాగా మెత్తగా చేయాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో ముళ్లు తీసిన చేపలు, మెత్తని బంగాళదుంపలు, కారం, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, గుడ్డు వేసి బాగా మెత్తగా గారెల పిండిలా చేయాలి.
ఆపై బాణలిని ఓవెన్‌లో పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అందులో ఫిష్ మసాలాతో గారెల్లా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే రుచికరమైన చేపలతో గారెలు రెడీ.