Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంత శ్రమించినా ఒక్క సీటు దక్కదు : కాంగ్రెస్ నేతల మనోగతం!

ఎంత శ్రమించినా ఒక్క సీటు దక్కదు : కాంగ్రెస్ నేతల మనోగతం!
, ఆదివారం, 15 ఏప్రియల్ 2012 (15:50 IST)
File
FILE
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో ఎంతగా శ్రమించినా అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, రాష్ట్ర పరిస్థితులు ఏమాత్రం తమకు అనుకూలంగా లేకపోవడంతో ప్రచారం కోసం ఎక్కువ శ్రమించడం ఎందుకనే భావన వారిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, చిరంజీవి రాజీనామా చేయడం వల్ల తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన విషయం తెల్సిందే. అలాగే, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికీ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానాలన్నింటికీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్‌తో పని లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన అభ్యర్థులనే తిరిగి అభ్యర్థులుగా ప్రకటించారు. వారికోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ఒక్కొక్క స్థానానికి అభ్యర్థి పేరును ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు.

కానీ, అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహా, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.

పైపెచ్చు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలువరన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, అధిష్టానం మాత్రం 18 సీట్లలో సగం సీట్లలోనైనా కైవసం చేసుకోవాలని లక్ష్య నిర్ధేశం చేసింది. ఈ టార్గెట్‌ను చేరుకోవాలంటే.. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు వారు ఏమాత్రం సిద్ధంగా లేరు.

ఈ ఉప ఎన్నికల్లో ఎంత శ్రమపడ్డా ఫలితం శూన్యమని పలువురు వాదిస్తున్నారు. దీనికి తోడు అగ్రనేతల ఇద్దరి మధ్య సమన్వయం మరింతగా లోపించిందని, అధిష్టానం ముఖ్యమంత్రి, పీసీసీ సారథి, డిప్యూటీ సీఎంలను పిలిచి తగిన సూచనలు ఇచ్చినప్పటికీ, వారి మధ్య సయోధ్య పెరగలేదన్నది వారి అభిప్రాయంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu