Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీ సీఎం యోగికి తప్పిన పెనుముప్పు

Advertiesment
yogi adityanath
, ఆదివారం, 26 జూన్ 2022 (15:39 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్‌ను వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అక్కడ నుంచి ఆయన మరో విమానంలో లక్నోకు బయలుదేరి వెళ్లారు. 
 
వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి యోగి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లక్నోకు బయలుదేరింది. ఈ హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ సురక్షితంగా కిందకు దించాడు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్‌కు వెళ్ళారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వారణాసి నుంచి లక్నోకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో ఆ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరివెళ్లారు. అయితే, ఈ విమానం బాబట్ పూర్ విమానాశ్రయం బయలుదేరింది. దీంతో వారణాసిలోని  సర్క్యూట్ హౌస్ నుంచి విమానాశ్రయం వరకు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మకూరు ఉప ఎన్నిక : 80 వేలకు పైగా మెజార్టీతో విక్రమ్ రెడ్డి గెలుపు