Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు.. పిల్లలూ జాగ్రత్త.. ఇంటి ఫుడ్డే సేఫ్

Advertiesment
Biscuits

సెల్వి

, మంగళవారం, 12 నవంబరు 2024 (10:29 IST)
బయట ఫుడ్ తింటున్నారా.. అయితే ఆగండి. ఇకపై హోటళ్లలో ఫుడ్, స్నాక్స్, ఇతరత్రా ప్యాకెట్ ఆహారాలకు బైబై చెప్పేసి.. వీలైనంతవరకు ఇంటి ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే.. ఆహారంలో కల్తీ చేరింది. నాణ్యత కొరవడుతోంది. ఇప్పటికే ఆహారాల్లో బొద్దింకలు కనపడిన దాఖలాలు వున్నాయి. ప్రస్తుతం పిల్లలు ఆశగా తీసుకునే బిస్కెట్లలో కూడా కల్తీ వచ్చి చేరింది. 
 
తాజాగా ఓ ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ప్యాకెట్లో పురుగులు కనిపించాయి.  నోయిడాకు చెందిన ఓ యువతి కొనుగోలు చేసిన ఓ బిస్కెట్‌ ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో పురుగు సంచరిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఇషికా జైన్ అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ ఫేమస్‌ బ్రాండ్‌ బిస్కెట్‌ ప్యాకెట్‌ని తెరిచి చూడగా బిస్కెట్‌లో పురుగు కనిపించిందని ఇషికా చెప్పింది. అనంతరం బిస్కెట్లను తిరిగి ప్యాకెట్‌లో పెట్టి మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. 
 
ఇంత పెద్ద బ్రాండెడ్‌ కుకీలు కూడా పురుగులుపట్టి ఉంటే, ఎవరిని నమ్మాలో తెలియటం లేదంటూ ఆమె వాపోయారు. అందుకే తినేటప్పుడు జాగ్రత్త పాటించాలని ఇషికా సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీకమాసం గుడి ప్రదక్షణలు చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి