Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో భార్య వద్దే వుంటున్న భర్తకు చుక్కలు.. కిడ్నాప్ చేసిన మొదటి భార్య

Advertiesment
Woman
, శనివారం, 13 జూన్ 2020 (14:00 IST)
కర్ణాటకలో ఓ యువతి భర్తకు చుక్కలు చూపించింది. తనను మోసం చేసిన భర్తకు తానేంటో నిరూపించింది. రెండో భార్య వద్ద వుంటున్న భర్తను కిడ్నా ప్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు హాసన్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రోమా అనే మహిళ తన భర్త షాహిత్ షేక్‌తో కలిసి మరాతహళ్లిలో ఉంటోంది. 
 
కానీ షాహిత్ మొదటి భార్యను వదిలేసి ఏడాది క్రితం రత్నా ఖాతుమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని విశ్వేశ్వరయ లే అవుట్లో ఆమె దగ్గరే ఉంటున్నాడు. రోమాను పట్టించుకోకుండా ఆమెకు దూరంగా వున్నాయి. డబ్బు కూడా రెండో భార్యకే ఇచ్చేవాడు.
 
తనను తన మానాన వదిలేసి చక్కగా రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఎలాగైనా సరే తన దగ్గరకు తెచ్చుకోవాలని రోమా ప్రయత్నించింది. తనభర్త తన దగ్గరకు రాకపోవటంతో భర్తకు కిడ్నాప్ చేయాలనుకుంది. దీంతో ఐదుగురు వ్యక్తులను నియమించుకుంది. వారికి రూ.2 లక్షలు కూడా ఇచ్చింది. 
 
దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జూన్ 7 న మధ్యాహ్నం 1 గంటలకు షాహిద్ కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కిడ్నాప్ కూడా చేశారు. తరువాత భరత్ ఫామ్ హౌస్‌కు తరలించి బందించారు. అలా బంధించిన తరువాత షాహిత్ పెనుగులాడుతూ.. తప్పించుకోవటానికి యత్నించటంతో కిడ్నాపర్స్ అతని కొట్టి పడేశారు.
 
ఈ క్రమంలో తన భర్త కనిపించట్లేదని రత్నా ఖాతుమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాహిత్ కోసం గాలిస్తుండగా.. ఎట్టకేలకూ షాహిత్‌ను పట్టుకున్నారు. విషయం తెలుసుకుని కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిని పట్టుకున్నారు. షాహిత్‌ను మొదటి భార్యే కిడ్నాప్ చేసిందని.. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పరారీలో వున్నారని పోలీసులు తెలిపారు. షాహిత్ మొదటి భార్యను కూడా అరెస్ట్ చేశామని.. 
 
రోమా షేక్ తన భర్తను తిరిగి పొందాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేయించిందని చెప్పారు. భర్తను కిడ్నాప్ చేయటానికి సదరు బృందం రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ రోమా వారితో బేరాలాండి రూ.2లక్షలకు బేరం కుదుర్చుకుందని.. షాహిత్‌ను కిడ్నాప్ చేశాక కిడ్నాపర్లు అతనిపై దాడి కూడా చేశారని అతనికి గాయాలు కావటంతో ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఎలా వుంది... జీజీహెచ్ వైద్యులు ఏమంటున్నారు?