Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టాలిన్ చెప్పినట్లు రాహుల్ గాంధీ కాదా? చంద్రబాబు మహాకూటమి ప్రధాని అభ్యర్థా?

Advertiesment
స్టాలిన్ చెప్పినట్లు రాహుల్ గాంధీ కాదా? చంద్రబాబు మహాకూటమి ప్రధాని అభ్యర్థా?
, శనివారం, 22 డిశెంబరు 2018 (18:55 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పించేందుకు మహాకూటమి ఏర్పడింది. ఇందులో దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భాగమైనాయి. ఈ నేపథ్యంలో మహాకూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా మహాకూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 
 
ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదన్నారు. కూటమిలోని నేతలంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్టాలిన్ కామెంట్స్‌పై తమకు సంబంధం లేదన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఇప్పుడే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మరో కోణంలో చర్చ మొదలైంది. రాహుల్ గాంధీని మహాకూటమి ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ ప్రతిపాదించడం బాబుకు అంతగా నచ్చలేదని.. ప్రధాని అభ్యర్థిగా తనపేరును ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.
 
అందుకే మిగిలిన పార్టీల నిర్ణయాలు తెలుసుకున్నాకే ప్రధాని అభ్యర్థిత్వం గురించి మాట్లాడాలని బాబు ప్రస్తావించారని వారు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహాకూటమి తరపున చంద్రబాబు ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా రాజకీయ పండితుల అభిప్రాయం. కానీ ఇందుకు మహాకూటమిలోని నేతల అభిప్రాయాలు ఏవిధంగా వుంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కేంద్ర రాజకీయాల్లో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో.. అంతకంటే ముందు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. అటు చంద్రబాబు ఇటు కేసీఆర్‌లు పరోక్షంగా కేంద్ర రాజకీయాల్లో కీలక పదవిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి వీరిద్దరికి ఉత్తరాది, దక్షిణాది కీలక నేతలు మద్దతిస్తారో లేకుంటే వాత పెట్టి పంపుతారో తెలియాలంటే వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శామీర్ పేట రేవ్ పార్టీ... డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసింది వాళ్లే...