Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సెకండ్ వేవ్ అంటే ఏమిటి? దాని నుండి మనం సురక్షితంగా ఎలా ఉండాలి?

Advertiesment
కరోనా సెకండ్ వేవ్ అంటే ఏమిటి? దాని నుండి మనం సురక్షితంగా ఎలా ఉండాలి?
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:20 IST)
వైరస్ తన యొక్క రెండవ దశలో రెట్టింపు పరివర్తనము చెందినట్లు కనుగొనబడింది. ఇది బ్రెజిల్ , దక్షిణాఫ్రికా మరియు యుకే జాతులకు చెందిన వైరస్ కంటే బలంగా తయారు అయ్యింది.
 
పరివర్తనము చెందిన ఈ కొత్త వైరస్ మానవ శరీరం లో ఉండే రోగనిరోధక శక్తిని మరియు కోవిడ్ నిరోధానికి కనిపెట్టబడిన వ్యాక్సిన్ ను సైతం ఎదుర్కొన గల సామర్ధ్యమును సైతం  సంపాదించినది. ప్రభుత్వము సూచించిన విధముగా టీకాలు పొందిన వ్యక్తులు సైతం మరలా కోవిడ్ ప్రభావానికి గురవడం వారిలో కేసులు నమోదు అవడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. 
 
ఈ సెకండ్ వేవ్ లో వైరస్ మరింత బలం గా మారి సూపర్ స్ప్రెడ్ గ్రూప్ అని  భావించే 18 నుండి45 సంవత్సరాల సమూహం లోని యువ జనాభాను సైతం అత్యంత ప్రభావితం చేయుచున్నది.
 
RT-PCR విధానం లో సాధారణంగా నిర్వహించే పరీక్షల ద్వారా ఈ కొత్త సెకండ్ వేవ్ కోవిడ్ కేసులను కనిపెట్టలేము మరియు నిర్ధారించలేము. 
 
కేవలం ప్రజల యొక్క అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి వలన మరియు కోవిడ్ ను నిరోధించుటకు తగిన మాస్కులను, చేతుల పరిశుభ్రత మరియు తగిన సామాజిక దూరము పాటించడము వంటి చర్యలు క్రమశిక్షణ తో పాటించకపోవడము వలన ఇది కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ద్వారా మరింత మందికి సోకుతూ తన పునరుత్పత్తి విలువను  రోజు రోజుకు పెంచుకుంటూ ఉన్నది. 
 
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు ఎలా ఉంటాయి?
గత సంవత్సరము కోవిడ్ మొదటి దశలో గమనించిన  లక్షణాలు ఏమిటంటే పొడి దగ్గు, జ్వరం , బలహీనత, శ్వాస సమస్యలు మరియు వాసన కోల్పోవడము. ప్రస్తుతము కోవిడ్ సెకండ్ వేవ్ లో గత సంవత్సరము కోవిడ్ మొదటి దశలో కనపడిన లక్షణాలు తో పాటు అదనముగా తలనొప్పి, నీళ్ళ విరోచనములు, వాళ్ళు నొప్పులు, నీరసము, అసౌకర్యముగా అనుభూతి చెందడం, వాంతులు, వినికిడి సమస్య ఏర్పడడము తో పాటు కళ్ళు ఎర్రబారడము లేదా కండ్ల కలక ఏర్పడవచ్చు.
 
ఈ వైరస్ సెకండ్ వేవ్ లో తీవ్రమైన అంటువ్యాధిగా అవతరించినది. ఒకవేళ కుటుంబములోని ఏదేని సభ్యుడు పొరపాటున  కోవిడ్ వ్యాధి గ్రస్తుడు అయినట్లయితే వ్యాధి అతనికి ఒక్కరికే పరిమితం కాకుండా ఆ కుటుంబ సభ్యులు అందరికీ ఈ వ్యాధి సోకుచున్నది. 
 
కోవిడ్ మొదటి దశలో వైరస్ మానవ శరీరములోని అవయవాలను అంటిపెట్టుకోవడానికి ACE II రెసెప్టర్ వంటి గ్రాహ కాలు సహాయ పడేవి.  కానీ వైరస్  తన రెండవ దశలో తనలో ఉండే  స్పైక్ ప్రోటీన్ ని అభివృద్ది పరచుకుని రెసెప్టర్ గ్రాహకాలు అవసరము లేకుండా మానవ శరీరం లో ఎక్కడి పడితే అక్కడికి స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఏర్పరచుకున్నది.
 
ప్రస్తుతం ఈ వైరస్ పిల్లలకు కూడా చాలా తేలికగా సోకుచున్నది. కాబట్టి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోండి మరియు వైరస్ పట్ల వారికి తగిన అవగాహన కల్పించండి.
 
ఇది సరైన సామాజిక దూరం పాటించకపోవడం వలన సంక్రమించే శ్వాసకోశ వ్యాధి అని భావించి వైరస్ గురించి భయపడకుండా ప్రభుత్వం సూచించిన సురక్షిత విధానాలు అయిన ముక్కు నోరుకు సరైన మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రత పాటించడం,సామాజిక దూరం పాటించడం వంటి వాటితో పాటు ప్రభుత్వం  సూచించిన విధముగా  టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలి.
 
కరోనా సెకండ్ వేవ్ గురించి మరికొన్ని వాస్తవ విషయాలు.
మీరు వాసన కోల్పోయారు  అనే లక్షణము మీరు గ్రహిస్తే మీరు కరోనాకు గురయ్యారు అని మీరు బలంగా విశ్వసించవచ్చు. ప్రపంచములో కోవిడ్ నిర్ధారణకు గోల్డ్ టెస్ట్ గా భావించే RT-PCR టెస్ట్ కు సమానమైన పరీక్ష గా ఈ లక్షణాన్ని భావించవచ్చు.
 
చాలా సందర్భాల్లో వ్యాధి లక్షణాలు కనపడిన మొదటి రోజు నుండి 9 రోజులు గడిచాక గాని వైరస్ తన ప్రతి రూపం పొందదు. ఇటువంటి సందర్భాల్లో వైరస్ అధిక జ్వరం కలుగ చేస్తుంది.101f కంటే అధిక జ్వరం ఉంటుంది. CRP వేగముగా పెరుగుతుంది. 3 వ రోజు దగ్గు ఉంటుంది. 
 
6 నిముషాల నడకలో రక్తం లో ఆక్సిజన్ శాతం నడక ప్రారంభానికి ముందు ఉన్న దాని కంటే  5శాతం తగ్గితే ఊపిరితిత్తులలో న్యుమోనియా గా అనుమానించాలి. 5 వ రోజు లక్షణాలు కొంచె క్లిష్టముగా ఉంటాయి.
 
కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించబడిన వ్యక్తి తో మీరు 6 అడుగుల దూరం లోపు  ఉండి, మరియు మీరు అతనితో 15 నిముషాలకు పైగా సంభాషించినట్లయితే మీకు కోవిడ్ సోకే ప్రమాద తీవ్రత చాలా హెచ్చుగా ఉంటుంది.
 
90 వ రోజును కోవిడ్ అంతిమ దినముగా మీరు భావించవచ్చు. పాజిటివ్ గా నిర్ధారించబడి చికిత్స తీసుకున్న వ్యక్తులకు 90 వ రోజు తరువాత నిర్వహించబడే RT-PCR పరీక్ష లో మరలా పాజిటివ్ గా నిర్ధారించబడితే అది చనిపోయిన వైరస్ యొక్క  ఆనవాళ్లుగా భావించవచ్చు.
 
ఒకవేళ RT-PCR పరీక్షలో ఫలితము నెగిటివ్ గా నిర్ధారణ అయ్యి మీ శరీరము లో  కోవిడ్ వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే దయచేసి మీ ఛాతీని వెంటనే CT స్కాన్ తీయించుకోండి.
 
నడక ద్వారా మన ఊపిరి తిత్తులకు న్యుమోనియా సోకినదా లేదో తెలుసుకొనడం ఎలా?
మనకు న్యుమోనియా సోకినది లేనిది అనేది ఈ పరీక్ష పాజిటివ్ గా నిర్ధారించబడినా 3 వ రోజు నుండి 6 వ రోజు లోపు నడక పరీక్ష నిర్వహించినపుడు ఫలితాలు ఆశాజనకముగా ఉంటాయి. మొదటగా నడక ప్రారంభానికి ముందు మన రక్తం లో ఉన్న ఆక్సిజన్ శాతం ఎంతో గుర్తించాలి.

తరువాత సదరు వ్యక్తి ఆగకుండా 6 నిముషాలు పాటు నడవాలి. నడక పూర్తయ్యాక మరలా రక్తం లో ఉన్న  ఆక్సిజన్ శాతం ఎంతో కొలవాలి. నడక ముందు ఉన్న శాతానికి 5 శాతం కంటే తగ్గితే అతని ఊపిరితిత్తులలో అంతర్గతముగా న్యుమోనియా అభివృద్ది చెందుచున్నదని భావించి సదరు వ్యక్తిని వెంటనే హాస్పిటల్ కు తరలించాలి.
 
కోవిడ్ సెకండ్ వేవ్ ని ఎదుర్కొనుటకు నిర్దేశించిన వ్యూహాలు.
కోవిడ్ పట్ల ఉన్న అజాగ్రత్తత మనస్తత్వమును మరియు మొండి వైఖరిని ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. ఇది వేగముగా వ్యాప్తి చెందుతున్నందున యుద్ద ప్రాధిపకతన తగిన చర్యలు అమలు చేయడం  అనేది అత్యవసరము.
 
మాస్కులు సరిగా ధరించని, కోవిడ్ నియమ నిబంధనలు సరిగా పాటించని వ్యక్తుల పట్ల కఠినముగా వ్యవహరించాలి. మాస్కు ధరించేటప్పుడు తొలగించే సందర్భాల్లో  జాగ్రత్త వహిస్తూ తగిన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి.
 
ఏదేనా పనిచేసే ముందు మీరు చేసే ఆ పని కరోనా ను నిరోదిస్తుందో లేక పెంచిపోషిస్తుందో అని ఒకసారి ఆలోచించండి. 
 
పబ్లిక్ మరియు ప్రభుత్వ సిబ్బందితో స్నేహపూర్వకముగా వ్యవహరించండి మరియు వారికి సహకరించండి.
 
కోవిడ్ నిబంధనలు పాటించడములో 100 శాతం వాటికి కట్టుబడి ఉండండి. వైరస్ ప్రభావాన్ని అర్ధం చేసుకుని తదనుగుణంగా అప్రమత్తతతో వ్యవహరించండి.
 
టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలలో 18 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్నవారిని చేర్చడం. ప్రభుత్వము సూచించిన విధముగా టీకా కోర్స్ ను పూర్తి చేయండి.
 
జంగ్ ఫుడ్ మరియు బయట తినడం పూర్తిగా మానుకోండి. పోషకవిలువలు తో కూడిన అఃహారముతో పాటు పళ్ల రసాలు మరియు తాజా కొబ్బరి నీరు తరచుగా తీసుకొనండి.
 
జనాభాలో ఉన్న 70 శాతం ప్రజలు పూర్తి వ్యాక్సినేషన్ పొందే వరకూ ఇలాంటి వేవ్ లు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ పూర్తిగా వ్యాధి నిరోధ కత శక్తి పొందే వరకూ మాస్కును వినియోగించడమే అనేది మానకూడదు.
 
ఊబకాయం, బీపీ, షుగరు వంటి అనారోగ్యాలతో బాధపడే వారు మరింత జాగ్రత్తతో ఉండాలి. ఈ సెకండ్ వేవ్ లో అధిక శ్రమ, వ్యాయామము  అనేది అవసరము లేదు. రోజు వారి దినచర్యలో ప్రాణాయామం మరియు యోగా చేర్చండి.
 
ఈ సెకండ్ వేవ్ అనేది 100 రోజుల వరకూ ఉంటుంది.
 
మనకు టీకా ఎందుకు అవసరము?
ప్రభుత్వము నిర్దేశించిన విధముగా 2 డోసుల టీకా పొందిన చాలా మండి వ్యక్తులు సైతం కరోనా వ్యాధితో ఆసుపత్రులయందు చేరుతున్నారు. అటువంటి వారందరికీ పరీక్షలు నిర్వహించా క అధిక సందర్భాలలో గమనించిన విషయము ఏమిటంటే వీరంతా అధిక  CT వాల్యు కలిగి ఉండి(CT వాల్యు తక్కువ నమోదు అయితే అధిక ప్రమాదము), తక్కువ వైరస్ ఇన్ఫెక్షన్ తో పాటు తేలికపాటి లేదా మితమైన వ్యాధి లక్షణాలతో పాటు వీరి ద్వారా వ్యాధి ప్రసార సామర్థ్యము అనేది చాలా తక్కువతో కలిగి ఉంటారని గమనించడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్