Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమల్‌కు వత్తాసు పలికిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్‌తో పాటు విపక్షాల సపోర్ట్....

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పల్లెత్తు మాట మాట్లాడని సినీ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ పెరిగిపోతోంది. విశ్వరూపం సందర్భంగా జయలలితకు కమ

కమల్‌కు వత్తాసు పలికిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్‌తో పాటు విపక్షాల సపోర్ట్....
, మంగళవారం, 18 జులై 2017 (10:35 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పల్లెత్తు మాట మాట్లాడని సినీ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ పెరిగిపోతోంది. విశ్వరూపం సందర్భంగా జయలలితకు కమల్ హాసన్‌కు పెద్ద వారే జరిగిన నేపథ్యంలో.. కమల్ సర్కారుపై చేస్తున్న విమర్శలపై అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. 
 
అయితే అన్నాడీఎంకే నేతలను ఏకిపారేస్తున్న కమల్ హాసన్‌కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. విపక్ష నేతలు పలువురు కమల్‌కు మద్దతు తెలిపారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, అందులో భాగంగానే కమల్ కూడా తన భావాలను వ్యక్తం చేశారంటూ డీఏంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, ఎండీఎంకే నేత వైగో తదితరులు కమల్‌కు వత్తాసు పలుకుతున్నారు. విపక్ష నేతలతో పాటు అన్నాడీఎంకే రెబల్ నేత, పురచ్చితలైవి అమ్మ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా కమల్ హాసన్‌కు మద్దతు పలికారు. 
 
రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ అవినీతి తాండవం చేస్తున్నదంటూ ప్రభుత్వంపై కమల్ హాసన్ దుమ్మెత్తి పోయడం అన్నాడీఎంకే పాలకుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. ఇప్పటికే ఆర్థిక మంత్రి జయకుమార్‌ తీవ్రంగానే స్పందించారు. ఈ మేరకు నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌పి వేలుమణి విరుచుకు పడ్డారు. కమల్‌ ఇన్నాళ్లు తమిళనాడులోనే ఉన్నారా? లేదా మరెక్కడైనా ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. వినోద పన్ను తగ్గింపు విషయంగా సినీ వర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలిసి మద్యం సేవించి.. భర్తపై సలసలకాగే వేడి నూనె పోసిన భార్య...