Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా సాయం చేస్తారు? : జగన్‌ను ప్రశ్నించి యువతి.. వీడియో వైరల్

Advertiesment
jagan - flood water

ఠాగూర్

, సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:35 IST)
కుండపోత వర్షంతో పాటు కృష్ణానది ఉప్పొంగడంతో విజయవాడ నగరం నీట మునిగింది. అనేక ప్రాంతాల్లో పీకల్లోతు నీరు నిలిచివుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా విద్యుత్ స్తంభాలో నీట మునిగిపోయారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రణాలను ఫణంగా పెట్టి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో రేయింబవుళ్లు చేయిస్తూ, తాను నిద్రపోకుండా, అధికారులకు సైతం నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సింగ్ నగర్‌‍తో పాటు మరికొన్ని వరద బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుంచి సాయం వరద బాధితులకు సాయం అందలేని ధ్వజమెత్తారు. అయితే, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి నిర్మొహమాటంగా ఏమాత్రం తొణకకుండా భయపడకుండా సమాధానం చెప్పిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మీకు ప్రభుత్వం సాయం అందిందా, ఇంకా అందలేదా అని ఓ మహిళను జగన్‌ ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో యువతి స్పందిస్తూ, నీళ్లు మెడ వరకు ఉన్నాయి. పాపం వాళ్లయినా ఎలా ఇస్తారు. అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు అని సమాధానం చెప్పారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2వేల వరద సాయాన్ని కేంద్రం వెంటనే ప్రకటించాలి.. రేవంత్ రెడ్డి