రీల్స్ పిచ్చి బాగా ముదిరింది. రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇక్కడ రీల్స్ కోసం ఓ వ్యక్తి నడిరోడ్డుపై శవంలా పడుకున్నాడు. అలా అతడు నడిరోడ్డుపై శవంలా పడుకుంటే.. అతని స్నేహితులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలనుకున్నారు. కానీ చివరికి చిప్పకూడు తినాల్సి వచ్చింది.
యూపీలోని కస్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి 23 ఏళ్ల ముకేశ్ కుమార్ నడిరోడ్డుపై అచ్చం శవంలా పడుకున్నాడు. అలా శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్‌స్టాలో రీల్ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు.
ఇక వీడియో తీయడం ముగిసిన వెంటనే పగలబడి నవ్వుతూ ముకేశ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో అప్పటివరకు నిజంగా యువకుడు చనిపోయాడని నమ్మిన అక్కడివారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
కాగా, ఈ ఘటన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో అప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ రాజేష్ భారతి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లోని రాజ్ కోల్డ్ స్టోరేజీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఓ వ్యక్తి శవంలా రోడ్డుపై పడుకుని వీడియో తీశాడు. అలా తన వీడియో ద్వారా అక్కడ కొంతసేపటి వరకు గందరగోళం సృష్టించాడు. దీనికి కారణమైన ముఖేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.