Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

Advertiesment
Hathras

సెల్వి

, సోమవారం, 17 మార్చి 2025 (20:33 IST)
Hathras
కాలేజీ ప్రొఫెసర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రొఫెసర్ వ్యవహారం ఓ బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొఫెసర్‌ వికృత చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలోని జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌ పలువురు మహిళా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
లేడీ స్టూడెంట్స్‌తో ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వీడియోలు రికార్డ్‌ చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ప్రొఫెసర్ రజనీష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

KTR: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్