Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీసిన భూతవైద్యుడు!!

Advertiesment
tantrik

ఠాగూర్

, ఆదివారం, 16 మార్చి 2025 (09:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన ఒకటి వెలుగు చూసింది. అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి చికిత్స పేరుతో ఒక భూతవైద్యుడు చికిత్స పేరుతో తలకిందులుగా వేలడాతీశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఆరు నెలల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉండే థాకడ్ అనే భూతవైద్యుడు వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారిపై చెడు నీడ ఉందని భయపెట్టిన రఘువీర్ భూతవైద్యం ప్రారంభించాడు. 
 
తన చికిత్సలో భాగంగా, మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీశాడు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడు ఆపకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి చరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్ళు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాన కైలాసం.. దక్షిణాన మురుగన్ నివాసం... అదే భారతదేశం - ఇది జగన్మాత ఆదేశం : పవన్ కళ్యాణ్