ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన 47ఏళ్ల ప్రముఖ నేత 25 ఏళ్ల ప్రతిపక్ష నేత కుమార్తెతో జంప్ అయిన ఘటన వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్టోయ్ జిల్లాలో ఆశిష్ శుక్లా అధికార బీజేపీ ప్రభుత్వానికి జిల్లా బీజేపీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
47 ఏళ్ల ఈ రాజకీయ నేతకు 21 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆశిష్ శుక్లాకు, అదే ప్రాంతానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కుమార్తెకు ఇటీవలే పరిచయం ఏర్పడింది. ఆశిష్ శుక్లా 25 ఏళ్ల మహిళతో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇదిలా ఉండగా సమాజ్ వాదీ నాయకుడు తన కూతురికి వేరే చోట పెళ్లి ఫిక్స్ చేశాడు. అయితే ఆశిష్ శుక్లా 25 ఏళ్ల మహిళతో పారిపోయాడు. ఈ ఘటన వైరల్‌గా మారడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
వారిపై కేసు నమోదు చేశామని, వారి కోసం వెతుకుతున్నామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.