Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు.. మేం ఏమీ చేయలేం : వెంకయ్య

ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదనీ అందువల్ల ఇపుడు తాము ఏమీ చేయలేమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తేల్చిపారేశారు.

Advertiesment
union minister m venkaiah naidu
, శుక్రవారం, 29 జులై 2016 (10:22 IST)
ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదనీ అందువల్ల ఇపుడు తాము ఏమీ చేయలేమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తేల్చిపారేశారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మనసులో ఉందన్న సంగతిని తాను కూడా అంగీకరిస్తానని, కానీ ఇదే అంశాన్ని విభజన చట్టంలో చేర్చాలని నాడు తనతో సమావేశమైన కేంద్ర మంత్రులు జైరాం రమేష్, కమల్‌నాథ్‌ల దృష్టికి తీసుకెళ్లినా వారు ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదని చెప్పారని గుర్తు చేశారు. అందువల్ల ఇపుడు తాము మాత్రం ఏం చేయగలమని ఆయన ప్రశ్నించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలో వెంకయ్య మాట్లాడుతూ ప్రాథమికంగా కాంగ్రెస్ తప్పులు చేస్తే... వాటిని తాము సరిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అయితే మనసులో ఉన్న కోరికలు చట్టాలు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
 
ఏపీకి ప్రత్యేకహోదాపై చర్యలకు అటార్నీ జనరల్‌ను అధ్యయనం చేయాలని ఆదేశించామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రత్యేకహోదాపై చర్చలు తీసుకుంటామన్నారు. ఓటమి పాలయ్యారు కాబట్టి కాంగ్రెస్ నేతలు ఏపీని వెనకేసుకుని వస్తున్నారని, అదే విజయం సాధించి ఉంటే ఎలా మాట్లాడి ఉండేవారో గుర్తించాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏఏ హామీలు చట్టంలో చేశారో వాటన్నింటినీ నెరవేరుస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్ అంటే భయపడేలా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు : హిల్లరీ క్లింటన్