Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవిష్యత్ అంటే భయపడేలా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు : హిల్లరీ క్లింటన్

అమెరికా అధ్యక్ష పీఠానికి తనతో పోటీపడుతున్న ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌‍పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ధ్వజమెత్తారు. అమెరికాను విచ్ఛిన్నం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నుతున్నారంట

భవిష్యత్ అంటే భయపడేలా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు : హిల్లరీ క్లింటన్
, శుక్రవారం, 29 జులై 2016 (10:12 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి తనతో పోటీపడుతున్న ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌‍పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ధ్వజమెత్తారు. అమెరికాను విచ్ఛిన్నం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిలిడెల్ఫియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి, భద్రత, జీవనప్రమాణాల మెరుగే తమ లక్ష్యమన్నారు. ప్రజల కలలను మేం సాకారం చేస్తాం. ట్రంప్‌లా నేను మాటల మనిషిని కాను... చేతల మనిషిని. ట్రంప్‌ను అమెరికా ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. 
 
ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి తలవంచేది లేదని ఆమె పునరుద్ఘాటించారు. ఐసీస్‌ను ఎదుర్కోవడం డొనాల్డ్ ట్రంప్ వల్ల కాదు. ఐసీస్‌ను ఎదుర్కొనే వ్యూహం మాకున్నాయి. ఉగ్రవాదంపై ట్రంప్‌కు కనీస అవగాహన లేదు. తుపాకీ చట్టాలను కఠినతరం చేస్తాం. భవిష్యత్ అంటే భయపడేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న వలసవాదులకు అండగా ఉంటామన్నారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు. 
 
నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితులు ఇప్పటికీ అమెరికాను వెంటాడుతున్నాయన్నారు. ట్రంప్‌కు అమెరికా కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. వ్యాపార వృద్ధి, సామాజిక భద్రత కోసం మాతో కలిసి పనిచేయండని పిలుపునిచ్చారు. అమెరికా బలహీనంగా లేదు... చాల శక్తివంతమైనది. మా ఆర్థిక విధానాలతో ప్రజల కలలు సాకారం చేస్తాం. అందరితో కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదంపై పోరు కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డులో యువకుడిని చెప్పుతో కొట్టిన తృప్తి దేశాయ్