Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడిరోడ్డులో యువకుడిని చెప్పుతో కొట్టిన తృప్తి దేశాయ్

ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ సారి ఏ గుడి కోసమో ప

Advertiesment
Activist
, శుక్రవారం, 29 జులై 2016 (09:50 IST)
ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ సారి ఏ గుడి కోసమో పోరాటం చేసిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈసారి నడిరోడ్డులో ఓ యువకుడిని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించినందుకు ఆ యువకుడికి తగిన గుణపాఠం చెప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
 
ఆ వివరాలను పరిశీలిస్తే... శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను లోబరచుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి కూడా అయ్యింది. అంతేకాదు గర్భవతి అయిన ఆ అమ్మాయిని అబార్షన్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆ యువ‌తిని చీట్ చేసినందుకు అందరూ చూస్తుండగా పుణె - అహ్మద్నగర్ రోడ్డుపై శిర్వాల్ అనే గ్రామం వద్ద అతనిని చెప్పుతో కొట్టింది. 
 
ఆ యువకుణ్ణి చెప్పుతో కొడుతున్న‌ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ యువకుడు మరో ఇద్దరు మహిళలను కూడా ఇలాగే మోసం చేశాడని, అందుకే అతనికి బుద్ధి చెప్పానని తృప్తి అన్నారు. అయితే ఈ చర్యను కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె చర్యను సమర్ధిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం హోదాలో కేసీఆర్ కష్టపడాలి కానీ.. ఫాంహౌస్‌లో పడుకుంటే ఎలా?: నారా లోకేశ్