Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం హోదాలో కేసీఆర్ కష్టపడాలి కానీ.. ఫాంహౌస్‌లో పడుకుంటే ఎలా?: నారా లోకేశ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సీఎం హోదాలో కష్టపడాలి కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో హాయిగా పడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంట

Advertiesment
Nara Lokesh
, శుక్రవారం, 29 జులై 2016 (09:45 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సీఎం హోదాలో కష్టపడాలి కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో హాయిగా పడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని నారా లోకేశ్ అన్నారు.

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయిందని, గడిచిన 45 రోజుల పాలన చూస్తుంటే... కేసీఆర్‌ను సొంత పార్టీ నేతలే నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. 
 
ఇకపోతే.. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఓ కీలక నేత తనకు ఫోన్ చేశారని.. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్ ఆయన రాచ మర్యాదలు చేశారని.. పార్టీలో జాయిన్ అయ్యాక ఆయన్ని కలవనీయట్లేదని వాపోయినట్లు నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇతర పార్టీ నేతలను గాలం వేసి తెరాసలో చేర్చుకుంటున్న కేసీఆర్.. ఆ తర్వాత వారిని ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు... గోల్డెన్ బాబా కెవ్వుకేక!