ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు... గోల్డెన్ బాబా కెవ్వుకేక!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోల్డెన్ బాబాగా వేషధారణ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు ధరించి విలాసవంతమైన ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగుతూ ప్రజలకు దర్శన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోల్డెన్ బాబాగా వేషధారణ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు ధరించి విలాసవంతమైన ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చాడు.
ఈయన ప్రతి యేడాది కన్వర్‌యాత్రను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా చేపట్టిన యాత్రలో ఇది 24వ యాత్ర. హరిద్వార్ నుంచి ఢిల్లీలోని గాంధీనగర్ ఆశ్రమం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఖర్చలు కోసం రూ.కోటి కేటాయించారు. ఈ బంగారు బాబా యాత్రలో ఆయన వెంట కనీసం 200 మంది ప్రజలు, పదిమంది అంగరక్షకులు ఉంటారు.
గోల్డెన్ బాబా వాహనంలో కూర్చొనివుంటే.. అంగరక్షకులు మాత్రం టాప్‌పై ఎల్లవేళలా పోలీసులు తుపాకులు పట్టుకొని గస్తీ కాయాల్సిందే. తొలి యాత్ర సమయంలో 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఈ స్వామి ఇపుడు ఏకంగా 12 కేజీల బంగారు ఆభరణాలను ధరిస్తున్నారు. పైవాడు (భగవంతుడు) అంతా ఇస్తున్నాడు చెప్పుకొనే ఈయన... బంగారు ఆభరణాలు ధరించడం లక్ష్మీదేవీ కరుణ కటాక్షాలకు గుర్తు అని, ఇందులో తన తప్పేమి లేదని చెప్పుకుంటున్నాడు.