Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిపుర హింసపై ట్వీట్లు : ఇద్దరు మహిళా జర్నలిస్టుల గృహనిర్బంధం

Advertiesment
Tripura VioTwo women journalists detained by Tripura Police for publishing fabricated news
, సోమవారం, 15 నవంబరు 2021 (07:46 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ఇటీవల చెలరేగిన హింసపై వరుస ట్వీట్లు ఇచ్చినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ఇద్దరిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచారు. 
 
ఓ మీడియా ఛానల్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు కవరేజీ కోసం వరుసగా ట్వీట్లు ఇచ్చారు. దీంతో అస్సోం పోలీసులు వీరిద్దరిని నిర్బంధించారు. తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌.. వారిపై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. 
 
నోటీసులు అందజేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులు తమను అనధికారికంగా నిర్బంధించారని సమృద్ధీ సకూనియా, స్వర్ణ ఝా జర్నలిస్టులు ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను వీరిద్దరూ సందర్శించారని, లేనిపోని విషయాలతో వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ట్వీట్లు చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తమముందు హాజరై విచారణ ఇవ్వాలని కోరినా స్పందించకుండా రాష్ట్రం వదిలి వెళ్లారని పోలీసులు చెప్పారు.
 
కాగా, జర్నలిస్టుల అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. త్రిపురలో హింసపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు సహా 71 మందిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపటి నుండి హైదరాబాద్ ఆరాంఘర్ ఎంజీబీఎస్ దారి మూసివేత