బీహార్ రాష్ట్రంలోని గయాలోని మొన్బార్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సలైట్లు ఉరితీశారు. ఆ తర్వాత వారి ఇంటిని బాంబుతో పేల్చేశారు. మృతుల్లో ఇద్దరు సోదరులు, వారివారి భార్యలు ఉన్నట్టు సమాచారం.
వీరందరినీ పోలీసుల ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందు వల్ల గతంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు నక్సలైట్లు పోస్టర్ అంటించారు. పైగా, ఈ గ్రామంలో ఎవరైనా తమకు నమ్మక ద్రోహం చేస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఈ దారుణం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్, ఎస్పీ రాకేశ్ కుమార్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
పదుల సంఖ్యలో సిబ్బందితో గ్రామంలో పహారా కాస్తున్నారు. దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి ఈ నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అలాగే, ఆ సమీప ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు.