Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్‌లో కిరాతక చర్య.. యువ జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం

బీహార్‌లో కిరాతక చర్య.. యువ జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
, ఆదివారం, 14 నవంబరు 2021 (12:59 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. యువ జర్నలిస్టు, ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నకిలీ క్లినిక్‌లపై ప్రత్యేక కథనాలు రాయడంతో పగబట్టిన మెడికల్ మాఫియా గ్యాంగ్ 22 యేళ్ల జ‌ర్న‌లిస్టును దారుణంగా చంపేసింది. ఈ జర్నలిస్టును నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని మ‌ధుబ‌ని జిల్లాకు చెందిన బుద్ధినాథ్ ఝా అలియాస్ అవినాష్ ఝా (22) స్థానికంగా ఉండే ఓ వెబ్ పోర్టల్‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్నారు. న‌కిలీ క్లినిక్‌ల‌పై రాసిన క‌థ‌నాల‌ను ఇటీవ‌ల త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. నాటి నుంచి బుద్ధినాథ్‌కు ప‌లు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. 
 
త‌మ క్లినిక్‌ల‌ను బ‌య‌ట‌కు లాగొద్ద‌ని కోరుతూ కొంద‌రు ఆ జ‌ర్న‌లిస్టుకు లంచం ఆశ చూపారు. అయిన‌ప్ప‌టికీ జ‌ర్న‌లిస్టు త‌లొంచ‌లేదు. దీంతో మంగ‌ళ‌వారం రాత్రి అత‌న్ని కిడ్నాప్ చేశారు. బెనిప‌ట్టీ లోహియా చౌక్‌లోని త‌న నివాసం వ‌ద్ద చివ‌రిసారిగా మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు క‌నిపించిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈయన నివాసం బెనిప‌ట్టి పోలీసు స్టేష‌న్‌కు 400 మీట‌ర్ల దూరంలో ఉంది.
 
అయితే రాత్రి 9 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బుద్ధినాథ్‌.. అక్క‌డున్న రోడ్డుపై తిరుగుతూ ప‌లు ఫోన్ కాల్స్ మాట్లాడిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో న‌మోదైంది. చివ‌రగా రాత్రి 9:58 గంట‌ల‌కు క‌నిపించాడు. ఆ స‌మ‌యంలో ప‌సుపు రంగు స్కార్ఫ్ మెడ‌లో వేసుకున్నాడు. 
 
అయితే, బుద్ధినాథ్ ఝా రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు గురువారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జ‌ర్న‌లిస్ట్ ఫోన్ సిగ్న‌ల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. బెనిప‌ట్టీకి ఐదు కిలోమీట‌ర్ల దూరంలోని బెటౌన్ వ‌ద్ద జ‌ర్న‌లిస్టు ఫోన్ సిగ్న‌ల్స్ బుధ‌వారం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు క‌ట్ అయిన‌ట్లు గుర్తించారు. 
 
పోలీసులు అక్క‌డికి చేరుకున్న‌ప్ప‌టికీ అక్క‌డ బుద్ధినాథ్ క‌నిపించ‌లేదు. బెటౌన్ జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న జ‌ర్న‌లిస్టు మృత‌దేహం ఉన్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. చేతికి ఉన్న రింగ్, మెడ‌లో ఉన్న బంగారు గొలుసు, కాలిపై ఉన్న గాయంతో అత‌ను బుద్ధినాథ్ అని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. జ‌ర్న‌లిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ నెత్తిన కొండలా రెవెన్యూ లోటు! : వెల్లడించిన కాగ్ నివేదిక