Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయమ్మ మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ ఏమంది.. శశికళను విచారించాలా?

Advertiesment
జయమ్మ మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ ఏమంది.. శశికళను విచారించాలా?
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (20:11 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించింది. తాజాగా ఈ నివేదికలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా.. ఆమె మరణించిన సమయం, జయలలితకు అందిన వైద్య చికిత్సలపై కమిషన్ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా జయలలిత నెచ్చెలి శశికళను విచారించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
 
జయలలిత 2016 డిసెబర్ 5న మరణించినట్లు వైద్యులు చెబుతున్నా... తాము విచారించిన సాక్షుల కథనం ప్రకారం.. ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ పేర్కొంది. ఈ లెక్కన జయలలిత మరణించిన మరునాడు ఆమె మరణాన్ని ప్రకటించారని తెలిపింది. 
 
జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన వైద్యుడు, జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శివకుమార్, నాడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. 
 
జయ మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు పైన చెప్పిన వారందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.
 
జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి...ఈ అనుమానాలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైం, డేట్, ప్లేస్ చెప్తే నేను సింగిల్‌గానే వస్తాను... మంత్రి జోగి రమేష్